మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 17:00:11

సల్మాన్-అనుష్క 'సుల్తాన్' కు నాలుగేండ్లు

సల్మాన్-అనుష్క 'సుల్తాన్' కు నాలుగేండ్లు

సల్మాన్ ఖాన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన చిత్రం సుల్తాన్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ హర్యానాకు చెందిన సుల్తాన్ అలీ ఖాన్ గా రెజ్లర్ రోల్ లో కనిపించాడు. రాష్ట్రస్థాయి రెజ్లర్ ఆర్ఫ హుస్సేన్ పాత్రలో అనుష్క నటించింది.  సల్మాన్-అనుష్క కాంబోలో లవ్, ఫ్యామిలో టచ్ ను జోడిస్తూ రెజ్లింగ్ ప్రాధాన్యతను తెలియజేస్తూ వచ్చిన ఈ సినిమా నేటితో నాలుగేండ్లు పూర్తి చేసుకుంది.

ఈ విషయాన్ని డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ..సమయం ఎగిరిపోతుంది. మంచి హిట్ అందించిన టీం మొత్తానికి కృతజ్ఞతలు అంటూ  కాప్షన్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ నుంచి మరో సుల్తాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా..నాకు నచ్చిన చిత్రాల్లో ఒకటి సుల్తాన్ అని మరో నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు. 

సల్మాన్ లంగోటా ధరించి కుస్తీవీరుడిగా అద్భుతంగా నటించి.. బాక్సాపీస్ కలెక్షన్ల సునామి సృష్టించాడు. సుల్తాన్ చిత్రంలోని పాటలు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్స్ గా నిలుస్తాయనంలో ఎలాంటి సందేహం లేదు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo