ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 06, 2020 , 13:33:11

లాక్‌డౌన్ అనుభ‌వాన్ని షేర్ చేసుకున్న స‌ల్మాన్ ఖాన్

లాక్‌డౌన్ అనుభ‌వాన్ని షేర్ చేసుకున్న స‌ల్మాన్ ఖాన్

ప్ర‌స్తుతం లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కి ప‌రిమిత‌మ‌య్యారు. కొంద‌రు మాత్రం ఇంట్లో ఉంటే ఏదో అవుతున్న‌ట్టు రోడ్ల‌పైకి విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. ఇలాంటి వారికి స‌ల్మాన్ త‌న దైన శైలిలో జ‌వాబిచ్చాడు. వీడియోలో స‌ల్మాన్ త‌న మేన‌ల్లుడు నిర్వాన్( సోహైల్ ఖాన్ కుమారుడు)తో క‌లిసి మాట్లాడుతూ.. మేము కొద్ది రోజుల క్రితం ఇక్క‌డికి (ఫాం హౌజ్‌) వ‌చ్చాము. ఇక్క‌డే ఇరుక్కుపోయాం అని స‌ల్మాన్ వీడియోలో పేర్కొన్నారు 

ఇక ప‌క్క‌నే ఉన్న నిర్వాన్‌ని నువ్వు నీ తండ్రిని చూడ‌క ఎన్ని రోజులు అవుతుందని స‌ల్మాన్  అడ‌గ‌గా, అత‌డు మూడు వారాలు అని బ‌దులిచ్చాడు. నేను నా తండ్రిని చూడ‌క మూడు వారాలు అయింది. మేము ఇక్క‌డ ఉన్నాం. ఆయ‌న ఇంట్లో ఒంట‌రిగా ఉన్నాడు అని చెప్పారు. అలానే నిర్వాణ‌తో నీకు  ఈ  సినిమా డైలాగ్ గుర్తుందా, 'భయపడిన వ్యక్తి మరణిస్తాడు (‘ జో డ‌ర్ గయా వో మార్ గయా ’) అని చెబుతాడు. ఈ పరిస్థితిలో ఇది ఇక్కడ వర్తించదు. మేము భయపడ్డాము, ధైర్యంగా ఉన్నాము . దానిని అంగీకరిస్తున్నాము. దయచేసి ఈ పరిస్థితిలో ధైర్యంగా ఉండకండి. అని స‌ల్మాన్ స్ప‌ష్టం చేశారు. అలానే మ‌రో డైలాగ్ చెబుతూ భ‌య‌ప‌డిన‌ వాడు త‌న‌ని, త‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న వారిని కాపాడుతాడు. మ‌నం భ‌య‌భ్రాంతుల‌కి గుర‌వుతున్నాం అని స‌ల్మాన్ వీడియోలో పేర్కొన్నారు  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo