గురువారం 28 మే 2020
Cinema - May 05, 2020 , 10:00:19

వెయ్యి కుటుంబాల‌కి సాయం చేసిన స‌ల్మాన్ ఖాన్

వెయ్యి కుటుంబాల‌కి సాయం చేసిన స‌ల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ క‌రోనా సంక్షోభంలో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌కార్మికుల‌కి త‌న వంతు సాయం చేస్తున్నారు. ఇప్ప‌టికే  సుమారు పాతిక వేల మంది కార్మికులకి  రోజువారీ నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహాయం చేసిన స‌ల్మాన్ తాజాగా ప్ర‌స్తుతం తాను ఉంటున్న ప‌న్వెల్ ఫాం హౌజ్ పరిస‌రాల‌లో ఉన్న పేద‌ల‌కి కూర‌గాయ‌ల‌తో పాటు రేష‌న్ పంపిణీ చేశారు. 

ప‌న్వెల్ ఫాం హౌజ్ నుండి ట్రాక్ట‌ర్స్‌, ఎండ్ల బండ్ల‌లో స‌రుకుల‌ని తీసుకెళ్లి మ‌హారాష్ట్ర‌లోని ప‌లు గ్రామాల్లో పంచారు స‌ల్మాన్.   పన్వెల్ చుట్టుపక్కల గ్రామాల్లోని 1000 కుటుంబాలకు బియ్యం, ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు మరియు ఆహార ధాన్యాలు సరఫరా చేశాడు. త‌న పొలంలో పండిన  కొన్ని నిత్యావసరాలు అందించాడు. అంతేకాక  ప్రాథమిక పరిశుభ్రతను కాపాడుకోవడానికి వందలాది శానిటైజర్లు మరియు సబ్బులను కూడా పంపిణీ చేశాడు. మ‌రో విష‌యం ఏమిటంటే, అత్యవసర పరిస్థితి లేదా అత్యవసర అవసరం వచ్చినప్పుడు గ్రామస్తులు న‌న్ను లేదా నా బృందాన్ని సాయం కోర‌వ‌చ్చని స్ప‌ష్టం చేశారు.

సాయం చేయ‌డంలో స‌ల్మాన్ తోడుగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, లులియా వాంట‌ర్, గాయ‌కుడు క‌మ‌ల్ ఖాన్ త‌దిత‌రులు సాయ‌ప‌డ్డారు. వారంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు స‌ల్మాన్.


logo