బుధవారం 08 జూలై 2020
Cinema - Jun 06, 2020 , 09:27:55

చీపురు ప‌ట్టిన స‌ల్మాన్..ప‌రిస‌రాల‌ని శుభ్రం చేసిన భాయిజాన్

చీపురు ప‌ట్టిన స‌ల్మాన్..ప‌రిస‌రాల‌ని శుభ్రం చేసిన భాయిజాన్

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం రోజున మోదీ త‌ల‌పెట్టిన స్వ‌చ్ భార‌త్‌ని ప్ర‌మోట్ చేస్తూ వీడియో షేర్ చేశాడు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించుకోవాలి. ఇంటి ప‌రిస‌రాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రప‌ర‌చుకోవాలి అని జ‌నాల‌లో చైత‌న్యం క‌లిగేలా స్వ‌యంగా   చీపురు ప‌ట్టి గార్డెన్‌ని క్లీన్ చేశారు స‌ల్మాన్ ఖాన్.

స‌ల్మాన్‌తో పాటు లులియా వాంట‌ర్ మ‌రి కొద్ది మంది స‌న్నిహితులు క్లీనింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని స‌ల్మాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే స‌ల్లూ భాయ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో విరాళాలు అందించ‌డంతో పాటు పేదవారికి నిత్యావ‌స‌ర వ‌స్తువులు కూడా అందించారు.logo