బాలీవుడ్ చిత్రసీమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చెలామణి అవుతున్నారు సల్మాన్‌ఖాన్. 33 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అద్వితీయ విజయాల్ని అందుకున్నారాయన. అంతులేని అభిమానగణం, స్టార్డమ్తో దూసుకుపోతున్న సల్మాన్‌ఖాన్ జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన సినీ ప్రయాణంతో పాటు జీవితంలోని ఎత్తుపల్లాలు, వివాదాలు, విఫల ప్రేమాయణాలను ఇందులో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. సల్మాన్‌ఖాన్ గురించి అభిమానులకు తెలియని కోణాల్ని చూపించబోతున్నట్లు తెలిసింది. ఈ డాక్యుమెంటరీకి సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్, రచయిత జావేద్ అక్తర్‌తో కలిసి కథను అందించనున్నట్లు వార్తలు వినిపిస్తునానయి. ఓటీటీ ద్వారా ఈ డాక్యుమెంటరీని విడుదలచేయబోతున్నారు.