సోమవారం 25 మే 2020
Cinema - Apr 10, 2020 , 15:55:35

ప‌చ్చి ఆకుకూర‌లు తింటూ గుర్రానికి తినిపిస్తున్న స‌ల్మాన్

ప‌చ్చి ఆకుకూర‌లు తింటూ గుర్రానికి తినిపిస్తున్న స‌ల్మాన్

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ లాక్ డౌన్ కార‌ణంగా ప‌న్వెల్ ఫాంహౌజ్‌కి ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా త‌న ఫ్యామిలీతో అక్క‌డే ఉంటున్న భాయ్ జాన్ సోష‌ల్ మీడియా ద్వారా అనేక విష‌యాలు షేర్ చేస్తున్నాడు. గ‌త రాత్రి ప‌ని మీద బ‌య‌టకి వెళ్లిన స‌ల్మాన్ నిర్మానుష్య‌మైన రోడ్ల‌ని చూసి అవాక్క‌యిన‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. తాజాగా మ‌రో ఆశ్చ‌ర్య‌కర‌మైన వీడియో షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు.

త‌న ఫామ్ హౌజ్‌లో ఉన్న గుర్రంకి అల్పాహారం అందిచే స‌మ‌యంలో ముందు తాను ప‌చ్చి ఆకుకూర‌లు తిని త‌ర్వాత గుర్రానికి పెట్టాడు. ఇది చూసిన నెటిజ‌న్స్ నోరెళ్ల‌పెట్టారు. "పోరాట సమయాల్లో ఆరోగ్యకరమైన అల్పాహారంష అని కొంద‌రు కామెంట్ పెట్ట‌గా, మ‌రికొంద‌రు మంచి డిటాక్సినేష‌న్ ఫుడ్ అని రాశారు. ఇంకొంద‌రు ఇంటర్నెట్‌లో నేటి అంద‌మైన వీడియో అని కామెంట్స్ పెట్టారు. ఏదేమైన స‌ల్మాన్ స్టైలే వేరే అని ఇంత క‌న్నా ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు .ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo