శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 23, 2021 , 07:45:42

మేన‌ల్లుడితో స‌ల్మాన్ డ్యాన్స్ .. వీడియో వైర‌ల్

మేన‌ల్లుడితో స‌ల్మాన్ డ్యాన్స్ .. వీడియో వైర‌ల్

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ త‌న మేన‌ల్లుడు ( అర్పిత కుమారుడు) అయ‌త్‌తో క‌లిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. స‌ల్మాన్ , ఆయుష్ శ‌ర్మ కొత్త చిత్రం యంటిమ్‌:  ది ఫైన‌ల్ ట్రూత్ సెట్‌లో స‌ల్లూ భాయ్ త‌న మేన‌ల్లుడితో బ‌జ‌రంగీ భాయిజాన్ చిత్రంలోని తుజో మిలా అనే ట్రాక్‌కు నృత్యం చేశాడు. అర్పితా ఖాన్ షేర్ చేసిన ఈ వీడియోలో స‌ల్మాన్ ఖాన్ త‌ల‌‌పాగాతో కనిపించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.  

స‌ల్మాన్ చివ‌రిగా ద‌బాంగ్ 3 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక రీసెంట్‌గా రాధే అనే చిత్ర షూటింగ్ పూర్తి చేయ‌గా, ఈ చిత్రం ఈద్ కానుక‌గా విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం కిక్‌2 అనే చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.


VIDEOS

logo