బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 12:45:35

సారే జహాసె అచ్ఛా పాట పాడి శుభాకాంక్ష‌లు తెలిపిన స‌ల్మాన్

సారే జహాసె అచ్ఛా పాట పాడి శుభాకాంక్ష‌లు తెలిపిన స‌ల్మాన్

74వ స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా సెల‌బ్రిటీలు అమ‌ర వీరుల త్యాగాల‌ని గుర్తు చేసుకుంటూ శుభాకాంక్ష‌లు అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్  సారే జహాసె అచ్ఛా పాట‌ని స్వయంగా పాడి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు. స‌ల్మాన్ పాడిన ఈ పాట‌కి సంబంధించిన వీడియోని ద‌ర్శ‌కుడు అటుల్ అగ్నిహోత్రి త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ప‌న్వెల్ ఫాం హౌజ్‌లో ఉన్న స‌ల్మాన్ .. జాక్వెలిన్‌తో క‌లిసి తెరె బినా అనే పాట‌ని చిత్రీకరించిన విష‌యం తెలిసిందే. ఈ సాంగ్ ప్ర‌తి ఒక్కరిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఓ రియాలిటీ షో కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు స‌ల్మాన్. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే  ప్రభుదేవా తెర‌కెక్కిస్తున్న‌ 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' లో కనిపించనున్నారు. ఇందులో దిషా పటాని, రణదీప్ హుడా, మరియు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కబీ ఈద్ కబీ దీపావళి చిత్రంలోను స‌ల్మాన్ న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.logo