శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 10, 2021 , 11:56:26

బిగ్ బాస్ వేదిక‌పై కంట క‌న్నీరు పెట్టుకున్న స‌ల్మాన్

బిగ్ బాస్ వేదిక‌పై కంట క‌న్నీరు పెట్టుకున్న స‌ల్మాన్

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం రాధే చిత్ర షూటింగ్‌తో పాటు బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్నాడు. గత కొన్ని సంవ‌త్స‌రాలుగా బిగ్ బాస్ షోని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్న స‌ల్మాన్ ఖాన్ ఎంతో మంది కంటెస్టెంట్స్‌తో ఆడించాడు, పాడించాడు, ఇంటి నుండి బ‌య‌ట‌కు పంపాడు. వీలైనంత సంద‌డి చేశాడు. అయితే ఈ సీజ‌న్‌లో జాస్మిన్ అనే కంటెస్టెంట్  బ‌య‌ట‌కు వెళ్ళాల్సి రావ‌డంతో స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. 

ఆదివారం ఎపిసోడ్‌లో అభినవ్‌ శుక్లా, జాస్మిన్‌లలో ఒక‌రు హౌజ్ నుండి బ‌య‌ట‌కు రాబోతున్నారు. జాస్మిన్‌పై స‌ల్మాన్‌కు ప్ర‌త్యేక అభిమానం ఉన్న నేప‌థ్యంలో ఆమె కోసం స‌ల్లూ భాయ్ కంట క‌న్నీరు పెట్టుకున్నాడు.  తాజాగా విడుద‌లైన ప్రోమోలో స‌ల్మాన్ కంట త‌డి పెట్ట‌డం  అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. బిగ్ బాస్ చరిత్ర‌లో  ఓ కంటెస్టెంట్ కోసం హోస్ట్ ఏడ‌వ‌డం ఇదే తొలిసారి కాగా, ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

VIDEOS

logo