సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసులో మరో ట్విస్ట్

సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు మళ్లీ విచారణకు వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కండల వీరుడు. ఒకట్రెండు సార్లు కోర్టుకు రాకుండా ఉండి న్యాయస్థానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. సల్మాన్ ఖాన్ ఫిబ్రవరి 6న విచారణకు హాజరుకావాలని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా, సెషన్స్ కోర్టు ఆదేశించింది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కరోనా కారణంగా చాలా రోజులకు జనవరి 16న కృష్ణజింకల కేసు మళ్లీ హియరింగ్‌కు వచ్చింది. ఈ సారి కూడా కోర్టుకు రాలేదు సల్మాన్. కరోనా నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కాలేనంటూ విన్నవించుకున్నాడు. ఆయన విన్నపాన్ని మన్నించిన కోర్టు.. ఫిబ్రవరి 6న జరగబోయే తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్ అప్పట్లో రెండ్రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత 2018లో ఈయనకు బెయిల్ వచ్చింది. అప్పట్నుంచి కూడా షరతులతో కూడిన బెయిల్ పైనే బయట ఉన్నాడు. 1998లో హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్లో భాగంగా జోధ్‌పూర్ వెళ్లారు సల్మాన్ ఖాన్ అండ్ టీం. అదే ఏడాది అక్టోబర్‌లో జోధ్‌పూర్‌లో జింకలను వేటాడినందుకు ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్‌కు 2018 మార్చిలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో సల్మాన్ ఒక్కడినే దోషిగా తేల్చింది కోర్టు.
అప్పుడు ఆయనతో పాటు ఉన్న సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలం, టబు, దుష్యంత్ సింగ్‌లను నిర్దోషులుగా ప్రకటించింది న్యాయస్థానం. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద సల్మాన్ దోషిగా తేలడంతో 10000 జరిమానాతో పాటు ఐదేళ్ల శిక్ష కూడా విధించింది. ఆ తర్వాత జోధ్‌పూర్‌లోని జిల్లా సెషన్స్ కోర్టుకు కేసు వెళ్లగా..స్టే విధించిన కోర్టు 2018లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరి ఫిబ్రవరి 6న ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగనుందో చూడాలి.
తాజావార్తలు
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్‌లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం