ఆదివారం 31 మే 2020
Cinema - May 10, 2020 , 13:19:12

స‌ల్మాన్, జాక్వెలిన్ తెరె బినా టీజ‌ర్ విడుద‌ల‌

స‌ల్మాన్, జాక్వెలిన్ తెరె బినా టీజ‌ర్ విడుద‌ల‌

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు సల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ప‌న్వెల్ ఫాంహౌజ్‌కి ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, లులియా వాంట‌ర్‌, త‌దిత‌రులు ఫాంహౌజ్‌లోనే ఉన్నారు. అయితే ప‌న్వెల్ ఫాం హౌజ్‌కి సంబంధించిన విశేషాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల్మాన్ లేదంటే జాక్వెలిన్ అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉన్నారు. తాజాగా స‌ల్మాన్ ఖాన్ త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా మాతృదినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. తెరె బినా టీజ‌ర్ విడుద‌ల చేశారు.

తెరె బినా సాంగ్‌ని స్వ‌యంగా స‌ల్మాన్ పాడ‌డంతో పాటు డైరెక్ట్ చేశారు. షబ్బీర్ అహ్మ‌ద్ లిరిక్స్ అందించారు.అజ‌య్ భాటియా స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ప‌న్వెల్ ఫాం హౌజ్‌లోనే ఈ సాంగ్‌ని షూట్ చేయ‌గా, ఇందులో సల్మాన్, జాక్వెలిన్ మ‌ధ్య రొమాన్స్ కూడా చూడ‌వ‌చ్చు. మ‌న జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి లేకుంటే ఆ జీవితం అసంపూర్ణంగా ఉంది. వారితో ప్రతి అడుగు ఒక కొత్త రోజులా అనిపిస్తుంది . మార్చి 12న తెరె బినా ఫుల్ సాంగ్ విడుద‌ల అవుతుందని స‌ల్మాన్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. స‌ల్మాన్-జాక్వెలిన్ కిక్, రేస్ 3లో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే.logo