శుక్రవారం 29 మే 2020
Cinema - Feb 16, 2020 , 07:21:25

బిగ్ బాస్ సీజ‌న్ 13 విజేత‌గా సిద్ధార్ధ్‌

బిగ్ బాస్ సీజ‌న్ 13 విజేత‌గా సిద్ధార్ధ్‌

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప‌లు ప్రాంతీయ భాష‌లలో ప్ర‌సారం అవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌న‌దేశంలో ముందుగా నార్త్‌లో మొద‌లు కాగా, ఆ త‌ర్వాత సౌత్‌కి పాకింది. అయితే నార్త్‌లో స‌ల్మాన్ హోస్ట్‌గా రూపొందిన బిగ్ బాస్ సీజ‌న్  13 కార్య‌క్ర‌మంకి నిన్న‌టితో ఎండ్ కార్డ్ ప‌డింది. ఫైన‌ల్ విజేత‌గా బాలికా వ‌ధు ఫేం సిద్ధార్థ్ శుక్లాని ప్ర‌క‌టించారు. ర‌న్న‌ర్‌గా అసిమ్ రియాజ్ నిలిచారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ కార్య‌క్ర‌మం బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. 

అయితే ఎంతో మంది మ‌ద్ద‌తు కూడుకున్న అసీంని కాద‌ని సిద్ధార్ధ‌ని విజేత‌గా ప్ర‌క‌టించ‌డంపై బిగ్ బాస్ షో క్రియేటివ్ టీం మెంబ‌ర్ ఫెరీహ మండిప‌డ్డారు. త‌న ట్విట్ట‌ర్ ద్వారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. షో మొత్తంలో సిద్ధార్ద్ శుక్లా అమ్మాయిల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం, పోట్లాడ‌డం వంటివి చేశారు. ఛానెల్ వారు అతనిని విన్న‌ర్‌గా ప్ర‌క‌టించ‌డం ద్వారా స‌మాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామ‌ని అనుకుంటున్నారు అని మండిప‌డ్డారు. తాను ఈ కార‌ణంగా ఛానెల్ నుండి నిష్క్ర‌మిస్తున్న‌ట్టు కూడా పేర్కొన్నారు. 13వ సీజ‌న్‌లో   రేషమీ దేశాయ్, సిద్దార్థ్ శుక్లా, షెనాజ్ గిల్, పారస్ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ, కోయినా మిత్రా, దల్జీత్ కౌర్, సిద్ధార్థ్ డే, ఆర్తీ సింగ్, అసీం రియాజ్, అబూ మాలిక్, షఫాలీ బగ్గా, మహీరా శర్మ  పాల్గొన్న విష‌యం విదిత‌మే. 


logo