బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొన్ని దశాబ్ధాలుగా సినిమాలతోను, టీవీ షోస్తోను ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు భారీ అభిమానగణం ఉంటుంది. అమితాబ్ కనిపించాడంటే ఆయనను కలవడానికి , సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్ ఎగబడుతుంటారు.ఆ సమయంలో వారిని కంట్రోల్ చేయడానికి బాడీగార్డ్స్ తల ప్రాణం తోకలోకి వస్తుంది.
అమితాబ్ బచ్చన్ దగ్గర జితేంద్ర షిండే అనే వ్యక్తి కొన్నాళ్లుగా బాడీగార్డ్‌లా పని చేస్తున్నారు. ఆయన అమితాబ్‌ని కంటికి రెప్పలా చూసుకుంటారు. బిగ్ బీకి ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు కరోనా కిట్ ధరించి ఆసుపత్రికి తీసుకెళ్లాడట. అస్వస్థత సమయంలో చాలా కేరింగ్‌గా చూసుకుంటాడట జితేంద్ర. ఆయనకు ఏడాదికి రూ.1.5 కోట్లు. అంటే నెలకు రూ.13 లక్షల రూపాయలని బిగ్ బీ జీతంగా ఇస్తున్నారట.
ప్రాణాలకు తెగించి మరీ అమితాబ్ ను కంటికి రెప్పలా కాపాడుతాడు కాబట్టి అతడి కోసం అమితాబ్ అంత జీతం చెల్లిస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. అమితాబ్‌కి తోడుగా నీడలా ఉండే జితేంద్ర ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు కూడా వెళుతుంటారట.ఏడు పదుల వయస్సులోను అమితాబ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికీ సినిమాలు,షోస్‌తో అలరిస్తూనే ఉన్నారు.