గురువారం 21 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 16:21:35

ప్ర‌భాస్ ' స‌లార్' కు ముహూర్తం ఫిక్స్

ప్ర‌భాస్ ' స‌లార్' కు ముహూర్తం ఫిక్స్

స్టార్ హీరో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌ను లైన్ లో పెట్టిన విష‌యం తెలిసిందే. రాధేశ్యామ్ తో పాటు స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో ‌న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న చిత్రం స‌లార్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌లార్ అప్డేట్ రానే వ‌చ్చింది. స‌లార్ జ‌న‌వరి చివ‌రి వారం నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. స‌లార్ జ‌న‌‌వ‌రి 15న ముహూర్తం పూజను నిర్వహించనున్నారు.

కర్ణాట‌క డిప్యూటీ సీఎం డాక్ట‌ర్ అశ్వ‌త్‌నారాయ‌ణ్ సీఎన్, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ య‌శ్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథులుగా రానున్నారు. హైద‌రాబాద్ లో స‌లార్ ముహూర్త‌పు పూజ జ‌రుగ‌నుంది. స‌లార్ షూటింగ్ ప్రారంభిస్తుండ‌టం, అభిమానుల‌కు లుక్ విడుద‌ల చేస్తుండ‌టం ప‌ట్ల‌ చాలా ఎక్జ‌యిటింగ్ గా ఉందని ప్ర‌భాస్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశాప‌టానీని హీరోయిన్ గా ఎంపిక చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

ఒకే ఫ్రేమ్‌లో 'వ‌రుడు కావ‌లెను' ఫ్యామిలీ

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

జాన్వీ క‌పూర్ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo