గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 16, 2021 , 01:08:44

‘సలార్‌' మొదలైంది

‘సలార్‌' మొదలైంది

హీరో ప్రభాస్‌ జోరుమీదున్నారు. వరుసగా సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్‌' శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.  ప్రశాంత్‌నీల్‌ (‘కేజీఎఫ్‌' ఫేమ్‌)దర్శకుడు.  హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకకు కర్ణాటక డిప్యూటి సీఏం అశ్వత్‌ నారాయణ్‌, కన్నడ అగ్ర హీరో యష్‌, నిర్మాతలు, దిల్‌రాజు, దానయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్‌ కిరగందూర్‌, ప్రభాస్‌కు ధన్యవాదాలు. యష్‌ ఈ రోజు మాతో ఉండటం ఆనందాన్ని కలిగించింది. ‘సలార్‌' మిమ్మల్ని నిరాశపరచదు’ అని ప్రశాంత్‌ నీల్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.  ప్రభాస్‌ ఈ సినిమాలో సరికొత్త పంథాలో కనిపించబోతున్నట్లు తెలిసింది.

VIDEOS

logo