Salaar | వరుస సినిమాలతో ప్రభాస్ ఇప్పుడు దూకుడు పెంచాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈయన.. సలార్, ఆదిపురుష్ సినిమాలను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ చక్కర్లు కొడుతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మేకర్స్.. మరో బాలీవుడ్ హీరోయిన్ను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది.
సలార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌తో ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో.. భారీ యాక్షన్ సీన్లతో పాటు.. ఓ మసాలా సాంగ్ కూడా ఉంటుందట. ఈ ఐటెం సాంగ్‌లో నటించేందుకే కత్రినా కైఫ్‌ను మూవీ మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం కత్రినాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. కాగా, సాహో చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రభాస్‌తో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్ మూవీ.. వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తన భర్త 8 సార్లు కాళ్లు పట్టుకున్నాడని చెప్పిన జెనీలియా
కారు ప్రమాదం.. నడవలేని పరిస్థితిలో బిగ్ బాస్ బ్యూటీ
దోస్తి సాంగ్‌లో ఆ సీన్ హాలీవుడ్ సినిమాకు కాపీనా?
Priyanka chopra | పదో తరగతిలోనే ఫస్ట్ లవ్.. ఆ టైంలో నా బాయ్‌ఫ్రెండ్‌ను బీరువాలో దాచిపెట్టా.