గురువారం 04 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 19:10:27

సాయిప‌ల్ల‌వి 'కోలు కోల‌మ్మా కోలో' సాంగ్ ప్రోమో సూప‌ర్‌

సాయిప‌ల్ల‌వి 'కోలు కోల‌మ్మా కోలో' సాంగ్ ప్రోమో సూప‌ర్‌

రానా ద‌గ్గుబాటి-సాయిప‌ల్ల‌వి లీడ్ రోల్స్ లో న‌టిస్తోన్న ప్రాజెక్టు  విరాట‌ప‌ర్వం. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి కోల్‌కోల‌మ్మా కోలో సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. కోలు ‌కోల‌మ్మా కోలో కోలో నా సామి..మ‌నసే మేలు కొని చూసే..క‌ల‌లో నిండినవాడే క‌నుల ముంద‌ర ఉంటే నూరేళ్లు నిదురా రాదులే అంటూ త‌న ప్రియుడిని ఊహించుకుంటూ సాయిప‌ల్ల‌వి పాడుకుంటున్న పాట అద్బుత‌మైన లిరిక్స్ తో సాగుతూ ప‌ల్లెప్రియుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంది. సాయిప‌ల్ల‌వి గ్రీన్ అండ్ యెల్లో క‌ల‌ర్ లంగావోణిలో చారిత్ర‌క ప్ర‌దేశంలో చేతిలో కొబ్బ‌రికాయ ప‌ట్టుకుని ఆనందంలో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది.


చంద్ర‌బోస్ రాసిన ఈ పాట‌ను దివ్య మాలిక‌, సురేశ్ బొబ్బిలి పాడారు. ఫిబ్ర‌వ‌రి 25న కోల్‌కోల‌మ్మా లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేయ‌నున్నారు. వేస‌వి కానుకగా ఏప్రిల్ 30న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుందీ చిత్రం. సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్. ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సుధాక‌ర్ చెరుకూరితో క‌లిసి సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo