మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 17:38:47

హర్ట్‌ అయిన సాయిపల్లవి..!

హర్ట్‌ అయిన సాయిపల్లవి..!

ప్రేమమ్ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైంది తమిళ బ్యూటీ సాయిపల్లవి. మళయాళం చక్కగా మాట్లాడుతుండటం, డ్రెస్సింగ్ స్టైల్ లో కేరళ టచ్ కనిపించడంతో అందరూ సాయిపల్లవిని మల్లూ గర్ల్‌ అని పిలిచేవారు. తనను ఇలా పిలవడంపై సాయిపల్లవి ఇప్పటికే చాలా సార్లు స్పందించింది. తమిళనాడులో పుట్టిన సాయిపల్లవి  తనను కొందరు పదే పదే మళయాళి అన్నపుడు కాస్త ఇబ్బందిగా ఫీలయిందట.

అంతేకాదు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో న్యూస్ యాంకర్ మల్లూ గర్ల్‌ అని సంబోధించడంతో..కోపంగా చూసి హర్ట్‌ అయిందట. తాను తమిళ యువతిని అని సాయిపల్లవి మరోసారి స్పష్టం చేసినట్లు టాక్‌. ప్రేమమ్ సినిమా చేయడం వల్లే తనను అలా పిలుస్తారని, తాను మళయాళీని కాదని సాయిపల్లవి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ భామ విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్నాడు. logo