శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 18:14:38

సైఫ్ అలీఖాన్ క్ష‌మాప‌ణలు చెప్పాలి..బీజేపీ నేత డిమాండ్

సైఫ్ అలీఖాన్ క్ష‌మాప‌ణలు చెప్పాలి..బీజేపీ నేత డిమాండ్

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ న‌టించిన వెబ్ సిరీస్ తాండ‌వ్‌. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌లైంది. అయితే ఈ వెబ్‌సిరీస్ లో సైఫ్ అలీఖాన్ మ‌రోసారి హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశార‌ని బీజేపీ నేథ రామ్ క‌ద‌మ్ ఆరోపిస్తున్నారు. డైరెక్ట‌ర్ అలీఅబ్బాస్ జాఫ‌ర్ లార్డ్ శివను ఫ‌న్నీగా చూపించి హిందూదేవుళ్లను అగౌర‌వ‌ప‌ర్చార‌ని, వెంట‌నే ఆ సన్నివేశాల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.

'ప‌లు బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ల‌లో ఎందుకు హిందూ దేవుళ్లు, దేవ‌త‌ల‌ను ఎందుకు కించ‌ప‌రుస్తున్నారో. తాజాగా తాండ‌వ్ వెబ్‌సిరీస్ కూడా ఓ ఉదాహ‌ర‌ణ‌. సైఫ్ అలీఖాన్ ఈ వెబ్‌సిరీస్ లో మ‌రోసారి అలాంటి స‌న్నివేశాల‌తో హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశారు. న‌టుడు జెషాన్ అయూబ్ క్ష‌మాప‌ణలు చెప్పాల్సిన అవ‌స‌ర‌ముంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ స‌న్నివేశాల్లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. బీజేపీ తాండ‌వ్ వెబ్ సిరీస్ ను  బ‌హిష్కరిస్తుంద‌ని' రామ్ క‌ద‌మ్ హెచ్చ‌రించారు. ఈ విష‌యంలో తాము ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని బాలీవుడ్ ను హెచ్చరిస్తూ రామ్ క‌ద‌మ్ ఓ వీడియో విడుద‌ల చేశారు. ఈ ప్రాజెక్టులో డింపుల్ క‌పాడియా, జీష‌న్ అయూబ్‌, సునీల్ గ్రోవ‌ర్, టిగ్‌మాన్షు ధూలియా, కుముద్ మిశ్రా త‌దిత‌రులు కీలక పాత్ర‌ల్లో న‌టించారు.

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo