బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 23:49:06

లంకేశ్‌గా సైఫ్‌

లంకేశ్‌గా సైఫ్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా పౌరాణిక ఇతిహాస కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘ఆదిపురుష్‌'. ఓం రౌత్‌ దర్శకుడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌అలీఖాన్‌ ప్రతినాయకుడు లంకేష్‌ పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం ప్రకటించింది. ప్రభాస్‌ మాట్లాడుతూ ‘సైఫ్‌అలీఖాన్‌ లాంటి గొప్ప నటుడితో పనిచేయబోతుండటం ఉత్సుకతగా ఉంది. ఆయనతో నటించే క్షణాల కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. ఓంరౌత్‌ మాట్లాడుతూ ‘ఏడు వేల ఏళ్ల క్రితంనాటి తెలివిపరుడైన రాక్షసుడిగా శక్తివంతంగా సైఫ్‌అలీఖాన్‌ పాత్ర సాగుతుంది. క్రూరమనస్తత్వంతో కూడిన భయానకమైన ప్రతినాయకుడిగా ఆయన కనిపించనున్నారు’ అని చెప్పారు. త్రీడీలో రూపొందుతున్న ఈ చిత్రానికి భూషన్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్‌ సూతార్‌, రాజేష్‌నాయర్‌ నిర్మాతలు. 2021లో చిత్రీకరణను ప్రారంభించి 2022లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. logo