శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 15:06:35

నెపోటిజం బాధితుడిని అన్న సైఫ్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

నెపోటిజం బాధితుడిని అన్న సైఫ్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సైఫ్ అలీఖాన్ త‌ర‌చు ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటాడు. సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై ఎక్కువ‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్న నేప‌థ్యంలో సైఫ్ అలీ ఖాన్ తాజాగా త‌న స్పంద‌న వినిపించాడు. బంధుప్రీతి గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను ఒకానొక స‌మ‌యంలో బంధుప్ర‌తి వ‌ల‌న ఇబ్బందులు ప‌డ్డాను అని పేర్కొన్నాడు సైఫ్‌. ప‌టౌడీ ఫ్యామిలీకి చెందిన సైఫ్ నెపోటిజం బారిన ప‌డ్డాడు అంటే ఇది విన‌డానికి చాలా ఇబ్బందిగా ఉంది  అంటూ నెటిజ‌న్స్ ఆయ‌న‌పై ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు.

నువ్వు బంధుప్రీతి వ‌ల‌న ఇబ్బందులు ప‌డ్డావంటే నీ కుమారుడు తైమూర్ కూడా నెపోటిజంకి గుర‌వుతాడు అని ఒక‌రు ట్వీట్ చేయ‌గా, మ‌రొక‌రు 5 రూపాయ‌ల యాక్టింగ్ చేయ‌మంటే 50 రూపాయ‌ల ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నావంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా, బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న నెపోటిజం వ‌ల‌న‌నే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడ‌ని కొంద‌రు ప్ర‌ముఖులు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలోనే కొద్ది రోజులుగా నెపోటిజంపై హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

 


logo