బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 16:16:27

సైఫ్‌‌, దీపికాల మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది : క‌రీనా

సైఫ్‌‌, దీపికాల మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది : క‌రీనా

బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టీమ‌ణుల‌లో దీపికా ప‌దుకొణే, క‌రీనా క‌పూర్ ఉన్నారు. దీపికా త‌న కెరీర్‌లో అద్భుత‌మైన సినిమాలు చేయ‌గా, అందులో మంచి విజ‌యం సాదించిన చిత్రాలు సైఫ్ అలీ ఖాన్‌తో న‌టించ‌నవే ఉన్నాయి. ఇటీవ‌ల సైఫ్‌, దీపికా న‌టించిన ల‌వ్ ఆజ్ క‌ల్ చిత్రం 11 ఏళ్లు పూర్తి చేసుకోగా, ఆ చిత్రానికి సంబంధించిన జ్ఞాప‌కాల‌ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది దీపికా.

లవ్ ఆజ్ కల్ , కాక్టెయిల్ ఈ రెండింటిలో దీపికా ప‌దుకొణే, సైఫ్ అలీఖాన్‌ల‌ కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌కి బాగా నచ్చింది. ఈ విష‌యాన్ని క‌రీనా క‌పూర్ ఖాన్ కూడా అంగీక‌రిచంఇంది. 2016లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌రీనా .. తెర‌పై సైఫ్‌, దీపికాల కెమిస్ట్రీ బాగుంటుంది. నటులుగా, ప్రతి ఒక్కరూ తెరపై ప్రదర్శన ఇస్తున్నారు, వాస్తవికతతో సంబంధం లేదని ఆమె అన్నారు. రియ‌ల్ లైఫ్‌ కెమిస్ట్రీ రీల్ లైఫ్ గా రూపాంతరం చెందాల్సిన అవసరం లేదు. అలాగే రీల్ జీవితం నిజ జీవితంలో తప్పనిసరిగా ఉండాల‌ని ఏమి లేదు అని క‌రీనా పేర్కొంది. కాగా, క‌రీనా, దీపికా ఇంత వ‌ర‌కు స్క్రీన్ పంచుకోలేదు.  సైఫ్, దీపిక..  లవ్ ఆజ్ కల్, రేస్ 2, కాక్‌టైల్ వంటి సినిమాలు చేశారు. వాటిలో ప్రతి ఒక్కటి  బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అలానే కరీనా, సైఫ్  కలిసి తాషన్, ఏజెంట్ వినోద్, కుర్బాన్ వంటి పలు సినిమాలు చేసారు . వాటిని అభిమానులు ఎంత‌గానో ఇష్ట‌ప‌డ్డారు. 


logo