మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 13:03:03

‘మేజర్‌’తో జతకట్టనున్న బాలీవుడ్‌ భామ

‘మేజర్‌’తో జతకట్టనున్న బాలీవుడ్‌ భామ

అడవి శేష్‌ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం మేజర్‌. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామను తీసుకోనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ నటుడు, ఫిల్మ్‌ మేకర్‌ మహేశ్‌ మంజ్రేకర్‌ కుమార్తె అయిన సయీ మంజ్రేకర్‌తో కథానాయిక పాత్ర చేయించాలని అనుకుంటున్నారట. సయీ హిందీ సినీ ప్రేమికులకు బాగా తెలిసిన ముఖమే. ఆమె యాక్షన్ డ్రామా చిత్రం దబాంగ్-3తో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించారు. వరుణ్ తేజ్ నటించనున్న బాక్సర్‌తో తెలుగు ఇండస్ట్రీలో ఆమె అరంగేట్రం చేస్తోంది. అయితే మేజర్‌ సినిమా కోసం సయీ మంజ్రేకర్‌ను మేకర్స్‌ ఫైనల్‌ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. వచ్చే నెల నుంచి హైదరాబాద్‌లో జరిగే షూటింగ్‌కు సయీ హాజరుకానుంది. 2008లో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరుడైన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో ‘గూఢచారి’ ఫేం శోభితా ధూళిపాళ సైతం ప్రధానపాత్రలో నటిస్తున్నారు. చిత్రానికి శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించనున్నారు. మహేశ్‌బాబు, ఏ ప్లస్‌ ఎస్ మూవీస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo