శుక్రవారం 10 జూలై 2020
Cinema - Jun 04, 2020 , 20:17:26

గ్లామరస్ లుక్ లో 'దబాంగ్-౩' భామ..ఫొటోలు వైరల్

గ్లామరస్ లుక్ లో 'దబాంగ్-౩' భామ..ఫొటోలు వైరల్

సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో నటించి మొదటి సినిమాతోనే ఫాలోవర్లను పెంచేసుకుంది అందాల భామ సయీ మంజ్రేకర్. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కూతురైన సయీ మంజ్రేకర్ 'దబాంగ్-౩' చిత్రంలో తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ బ్యూటీ గ్లామరస్ లుక్ లో కనిపిస్తున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సయీ మంజ్రేకర్ బీచ్ లో, ఇంటిలో, ఫొటోషూట్ లో దిగిన స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సయీ మంజ్రేకర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.