బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సైదులు’. అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘హక్కుల కోసం, స్వేచ్చ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్ర కథ వుంటుంది. త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తాం’ అన్నారు.