మంగళవారం 09 మార్చి 2021
Cinema - Dec 24, 2020 , 18:14:49

సోలో బ్రతుకే సో బెటర్ ప్రివ్యూ..సాయి ధరమ్ తేజ్ సాహసం

సోలో బ్రతుకే సో బెటర్ ప్రివ్యూ..సాయి ధరమ్ తేజ్ సాహసం

సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతూ ఉంటే దానికి పని చేసిన దర్శకుడు నిర్మాతలతో పాటు నటీనటుల ఆసక్తిగా వేచి చూస్తారు. విడుదలైన తర్వాత ఎలాంటి ఫలితం వస్తుందా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని కూర్చుంటారు. కానీ ఇప్పుడు సాయి ధరంతేజ్ సోలో బ్రతుకే సో బెటరూ సినిమా విషయంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా వేచి చూస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని దర్శక నిర్మాతలు కూడా చూస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. లాక్ డౌన్ తర్వాత ఇప్పటివరకు పెద్ద సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత తెలుగు సినిమాలు ఏవి రాలేదు. 

మధ్యలో రాంగోపాల్ వర్మ కరోనా వైరస్, మర్డర్ లాంటి సినిమాలు వచ్చాయి కానీ అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత టాలీవుడ్ లో విడుదలవుతున్న తొలి క్రేజీ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. దాంతో దీని ఫలితం ఎలా ఉంటుందా అని అందరూ చూస్తున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకి వచ్చే రెస్పాన్స్ చూసి మిగిలిన సినిమాలను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

అందుకే సాయి సినిమా కోసం వాళ్లతోపాటు మిగిలిన వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.ఇక కథ విషయానికి వస్తే ఈ రోజుల్లో చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉండడం ఒక ఫ్యాషన్ లా ఫీలవుతున్నారు. సోలోగా ఉంటే ఏదైనా చేసేయొచ్చు అని తమకు తాము చెప్పుకుంటున్నారు. అలా పెళ్లిళ్లకు కొంతమంది దూరమవుతున్నారు. కానీ సోలోగా ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి.. మన జీవితంలో ఒక అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే మనం ఎంత ఎదుగుతాం అని అంతర్లీనంగా ఒక సందేశం ఇస్తూ ఈ సినిమా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు సుబ్బు. గతంలో ఈయన విరించి వర్మ లాంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పని చేశాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైన‌ర్ గా సోలో బ్రతుకే సో బెటర్ వస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

ప‌వ‌న్ సినిమా..సాయిప‌ల్ల‌వి రూ.2 కోట్లు డిమాండ్‌..?

రామ్ చేతిలో ఏం ప‌ట్టుకెళ్తున్నాడో చూడండి..వీడియో

ఆదివాసీల‌తో ‘వ‌కీల్‌సాబ్’‌..వీడియో వైర‌ల్

నాగ‌చైత‌న్య భీష్మాస‌నం ఎలా వేశాడో చూడండి

కామెడీ క్లబ్ నుంచి బ‌య‌టికొస్తున్న సునీల్‌..!

జ‌గ‌ప‌తిబాబు చిత్రానికి స‌రికొత్త టైటిల్‌

2020లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సెల‌బ్రిటీలు వీళ్ళే..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

తాజావార్తలు


logo