గురువారం 04 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 20:07:05

తేజూ ఎప్పుడు మొదలుపెట్టావ్..ఎప్పుడు పూర్తి చేసావ్..?

తేజూ ఎప్పుడు మొదలుపెట్టావ్..ఎప్పుడు పూర్తి చేసావ్..?

కొన్ని సినిమాలు అంతే..ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేస్తారో అస్సలు అర్థం కాదు. అంత వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంటాయి. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. విలక్షణ దర్శకుడు దేవాకట్టా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తన కెరీర్ లో తొలిసారి పూర్తిస్థాయి పొలిటికల్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు సాయి తేజ్. వరస విజయాలతో జోరు మీదున్న ఈ హీరో..రిపబ్లిక్ తోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత షూటింగ్స్ కు అనుమతి ఇచ్చారు ప్రభుత్వం. అప్పట్నుంచి ఎలాంటి బ్రేకులు తీసుకోకుండా నాలుగు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ చేశారు టీమ్. 

కోవిడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఒక్కటంటే ఒక్కటి కూడా కోవిడ్ కేసు లేకుండా తమ సినిమా షూటింగ్ పూర్తయిందని గర్వంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే నిన్నగా మొన్న మొదలైనట్టు కనిపించిన ఈ సినిమా షూటింగ్ అప్పుడే పూర్తి చేసుకోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. రమ్యకృష్ణ ఇందులో ప్రతినాయకురాలి పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాపై ముందు నుంచి కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నాడు సాయి తేజ్. తన కెరీర్ లో స్పెషల్ సినిమా అవుతుందని నమ్మకంగా చెప్తున్నాడు ఈ మెగా మేనల్లుడు. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్ సైతం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. 

దాంతో సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దర్శకుడు దేవా కట్టా. ఈయనకు ఈ మధ్య కాలంలో హిట్ లేదు. పదేళ్ల కింద వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ సినిమా లేదు. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.  ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా కూడా చాలా వేగంగా రిపబ్లిక్ సినిమాను పూర్తి చేసాడు సాయి. జూన్ 4న సినిమా విడుదల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo