మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 13:16:00

బావా..నీకు పెళ్ళా? : సాయి తేజ్ ప్ర‌శ్న‌

బావా..నీకు పెళ్ళా? : సాయి తేజ్ ప్ర‌శ్న‌

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీలకి సంబంధించి వ‌స్తున్న పుకార్లకి అడ్డు అదుపు ఉండ‌డం లేదు. సినిమాల ద‌గ్గ‌ర నుండి వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ వ‌ర‌కు గాసిప్స్ క్రియేట్ చేస్తూ జ‌నాల‌ని క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల నాగ‌బాబు త‌న పిల్లల పెళ్ళి గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. నిహారిక‌, వ‌రుణ్ తేజ్‌ల పెళ్లి త్వ‌ర‌లోనే చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.

నాగబాబు చెప్పిన విష‌యాన్ని ప‌లు వెబ్ సైట్స్ జోరుగా ప్ర‌చారం చేశాయి. దీంతో ఈ  విష‌యం సాయిధ‌ర‌మ్ తేజ్ ద‌గ్గ‌ర‌కి రాగా, ఇందులో నిజ‌మెంత ఉంద‌నే విష‌యాన్ని క‌న్‌ఫాం చేసుకోవ‌డానికి డైరెక్ట్‌గా వ‌రుణ్ తేజ్‌ని..ఏంటి బావ ?  నీకు పెళ్లంటా అని అడిగాడు. ఈ ట్వీట్ చూసి సంగీత ద‌ర్శ‌కుడు థ‌మన్ .. `నిజమా?` అని ప్రశ్నించాడు.  మొత్తానికి వరుణ్ పెళ్ళి మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. 


logo