గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 00:21:43

సౌందర్య బయోపిక్‌లో?

సౌందర్య బయోపిక్‌లో?

దివంగత కథానాయిక సౌందర్య జీవితం వెండితెర దృశ్యమానం కానుంది. దక్షిణాదిలో వందకుపైగా చిత్రాల్లో  తన అద్భుతాభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె విషాదాంత మరణం ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచివేసింది. ఈ నేపథ్యంలో ఆమె సినీ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ఓ అగ్ర నిర్మాణ సంస్థ బయోపిక్‌ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సౌందర్య పాత్రను సాయిపల్లవి పోషించనుందని సమాచారం.  భారీ వ్యయంతో అన్ని దక్షిణాది భాషల్లో ఈ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో నటించడానికి సాయిపల్లవి ఇప్పటికే అంగీకారం తెలిపిందని, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.logo