శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 00:42:50

ప్రేమలో మునిగిన వెన్నెల

ప్రేమలో మునిగిన వెన్నెల

రానా, సాయిపల్లవి జంటగా ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.   ఈ నెల 25న సినిమాలోని తొలి గీతం ‘కోలు కోలు’ లిరికల్‌ వీడియోను విడుదలచేయబోతున్నట్లు సోమవారం చిత్రబృందం ప్రకటించింది. సాయిపల్లవి పోస్టర్‌ను విడుదలచేసింది. ఇందులో కాకతీయ తోరణం వద్ద డ్యాన్స్‌ చేస్తూ ఆమె కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ను ఉద్దేశిస్తూ ‘ప్రేమలో మునిగి ఉన్న వెన్నెల’ అంటూ సాయిపల్లవి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది.   నిర్మాత మాట్లాడుతూ “కోలు కోలు..’ పాటను సాయిపల్లవిపైన  చిత్రీకరించాం. యూనిక్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. విప్లవం, ప్రేమ, మహిళా సాధికారతతో ముడిపడి సాగుతుంది. ఏప్రిల్‌ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ప్రియమణి,  నందితాదాస్‌, నివేదా పేతురాజ్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: డానీ సాంచెజ్‌ లోపెజ్‌, దివాకర్‌ మణి. 


VIDEOS

logo