శుక్రవారం 27 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 23:55:02

నానితో వన్స్‌మోర్‌

నానితో వన్స్‌మోర్‌

‘ఎమ్‌సీఏ’ చిత్రంలో చక్కటి కెమిస్ట్రీతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు నాని, సాయిపల్లవి. మరోసారి  ఈ జోడీ తెలుగు తెరపై సందడి చేయబోతున్నారు. నాని కథానాయకుడిగా నటించనున్న చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్‌'. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించనున్నారు. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలుగా నటించబోతున్నారు. ‘విభిన్నమైన  కథ, కథనాలతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో నాని ఆహార్యం, లుక్‌ కొత్తగా ఉంటాయి. భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’ అని చిత్రబృందం చెప్పింది. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సాను జాన్‌ వర్గీస్‌ ఛాయాగ్రహకుడు.