శుక్రవారం 03 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 08:34:10

నేను త‌మిళ అమ్మాయిని.. ఊరికే అలా పిల‌వొద్దు: స‌్టార్ హీరోయిన్

నేను త‌మిళ అమ్మాయిని.. ఊరికే అలా పిల‌వొద్దు: స‌్టార్ హీరోయిన్

చేసింది త‌క్కువ సినిమాలే అయిన స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లింది ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌వి.2015లో ప్రేమ‌మ్ అనే మ‌ల‌యాళ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన  ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం భాష‌ల‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది సాయి ప‌ల్ల‌విని మ‌‌ల‌యాళీ అని అనుకుంటారు. కొన్ని సార్లు అలానే పిలుస్తారు కూడా. దీనిపై ప‌లుసార్లు క్లారిటీ కూడా ఇచ్చింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్.. సాయి ప‌ల్ల‌విని మ‌ల‌యాళీ అని పిలవ‌డంతో కొంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తుంది. 

సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో సాయి పల్లవిని యాంకర్ మలయాళీ అని పిలిచిందట. అలా పిలవడంతో ఈ చెన్నై బ్యూటీకి కోపం వచ్చి 'నేను మలయాళీని కాదు. తమిళమ్మాయిని. కోయంబత్తూర్ లోనే పెరిగాను. నన్ను ఇంకెప్పుడు మలయాళీ అని మాత్రం పిలవకండి' అంటూ  సమాధానం ఇచ్చిందట ఈ నేచురల్ బ్యూటీ. స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. 

సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తోంది. హీరో రానా సరసన నటిస్తున్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి ఒక పేద జానపద కళాకారిణిగా కనిపించనుందట. మ‌రోవైపు ల‌వ్ స్టోరీ అనే చిత్రం కూడా చేస్తుంది.  ఫిదా, పడిపడి లేచే మనసు సినిమాలలో మేకప్ లేకుండా నటించి.. అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి  తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదని చెబుతుంది.  మేకప్ వేసుకోవడం వల్ల తన నేచురల్ అందం పోతుందని.. మేకప్ లేకుంటేనే బాగుంటానని అంటుంది.


logo