e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home సినిమా రెండేళ్ల తర్వాత తమిళంలో..

రెండేళ్ల తర్వాత తమిళంలో..

దక్షిణాదిలో హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది అగ్ర నాయిక సాయిపల్లవి. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే ప్రతిభ కలిగిన నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొగసరి గత రెండేళ్లుగా తమిళ వెండితెరకు దూరంగా ఉంటోంది. సూర్య సరసన ‘ఎన్‌జీకే’ తర్వాత ఆమె బిగ్‌స్క్రీన్‌పై కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి తమిళంలో భారీ సినిమాను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందించబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ సంస్థ తెరకెక్కించబోతున్నది. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుత సమాజంలోని బలమైన సమస్యను చర్చిస్తూ ఈ సినిమా కథాంశానికి రూపకల్పన చేశారని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో ‘లవ్‌స్టోరీ’ ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల విడుదల సెకండ్‌వేవ్‌ కారణంగా ఆలస్యమైంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana