Tollywood | తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. సెప్టెంబర్ 24న భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. నాగచైతన్య గత సినిమాలతో పోలిస్తే భారీ బిజినెస్ చేసింది లవ్ స్టోరీ. దానికి కారణం శేఖర్ కమ్ముల గత సినిమా ఫిదా ఏకంగా 47 కోట్ల షేర్ వసూలు చేయడమే. దానికి తోడు సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఖచ్చితంగా అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. లవ్ స్టోరీ సినిమాపై అంచనాలు పెరగడానికి ఆమె కూడా ఒక కారణం. ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ దాదాపు 32 కోట్లకు పైగా జరిగినట్టు తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత బిజినెస్ జరగడం చాలా కష్టం. కానీ లవ్ స్టోరీ సినిమాపై ఉన్న అంచనాలు విడుదలవుతున్న తీరు చూస్తుంటే.. పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ వసూలు చేయడం పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది. 33 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతుంది ఈ సినిమా. ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ చాలా చోట్ల సినిమాను సొంతంగా విడుదల చేసుకుంటున్నాడు.
దాదాపు 17 కోట్లకు పైగా ఓన్ రిలీజ్ చేస్తున్నాడు ఈ నిర్మాత. ఓవర్సీస్లో కూడా మంచి రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాను. శాటిలైట్, డిజిటల్ కలిపి మరో 17 కోట్ల వరకు నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా థియేట్రికల్ బిజినెస్‌తో పాటు అన్ని కలిపి 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది లవ్ స్టోరీ. మరి ఇంత మొత్తం నాగ చైతన్య సినిమా వసూలు చేస్తుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ సినిమా తీసినందుకు ఈవీవీని అంతలా తిట్టారా.. సంచలన విషయాలు బయటపెట్టిన కోట
గోవాలో రోడ్డు ప్రమాదంలో ప్రియుడితో పాటు హీరోయిన్ దుర్మరణం
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షో..
పూజా హెగ్డే తీరుతో ప్రభాస్ నిర్మాతలు విసిగిపోతున్నారా..!
ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?
Lobo: ప్రియాంకతో అసభ్యంగా ప్రవర్తించిన లోబో.. తోటి వారితో చెప్పుకొని బాధపడ్డ ట్రాన్స్ జెండర్