Love story movie collections |చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్ కూడా దద్ధరిల్లిపోయింది. ఓవర్సీస్ మార్కెట్ తెలుగు సినిమాకు ఇంక కలేనా అనుకుంటున్న తరుణంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమాకు ఊహించని రికార్డు వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం అక్కడ తొలిరోజే హాఫ్ మిలియన్ మార్క్ అందుకోవడం నిర్మాతలకు ఆనందాన్ని నింపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం దూకుడు చూపించింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా తొలిరోజే 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా లవ్ స్టోరీ కలెక్షన్స్ మాత్రం మోత మోగిపోతున్నాయి. చాలా రోజుల తర్వాత థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు బారులు తీరారు. మరి ఈ చిత్రం సాధించిన తొలిరోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం..
నైజాం: 3.06 కోట్లు
సీడెడ్: 1.08 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.61 కోట్లు
ఈస్ట్: 0.48 కోట్లు
వెస్ట్: 0.55 కోట్లు
గుంటూరు: 0.59 కోట్లు
కృష్ణా: 0.33 కోట్లు
నెల్లూరు: 0.25 కోట్లు
ఏపీ + తెలంగాణ: 6.95 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.32 కోట్లు
ఓవర్సీస్: 2.40 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 9.66 కోట్లు షేర్
లవ్ స్టోరి సినిమాకు రూ.31.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 33 కోట్ల బ్రేక్ ఈవెన్ చేస్తే సినిమా సేఫ్ అయినట్లు. అయితే తొలిరోజే సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రావడంతో నిర్మాతలతో పాటు బయ్యర్లు కూడా ధైర్యంగా కనిపిస్తున్నారు. మూడు రోజుల పాటు ఇదే దూకుడు చూపిస్తే కచ్చితంగా లవ్ స్టోరీ సినిమాకు వీకెండ్ కలెక్షన్స్ రూ. 20 కోట్లకు పైగానే రావడం ఖాయం. అయితే రూ. 33 కోట్లు రావాలంటే మాత్రం కచ్చితంగా వీక్ డేస్‌లోనూ బాగా పర్ఫార్మ్ చేయాల్సిందే. మరి చూడాలిక.. లవ్ స్టోరి సినిమాకు ఆ లాంగ్ రన్ ఉందో లేదో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
సాయిపల్లవిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా..
ఇదే కదా నిర్మాతలు కోరుకుంది.. లవ్ స్టోరీ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ పక్కా..!
Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!
అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు