మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 19:03:51

రాజ్‌పుత్‌ రాణి గెటప్‌లో సాయిపల్లవి..ఫొటో వైరల్‌

రాజ్‌పుత్‌ రాణి గెటప్‌లో సాయిపల్లవి..ఫొటో వైరల్‌

తొలి సినిమాతోనే అందరినీ ఫిదా చేసింది కోలీవుడ్‌ సోయగం సాయిపల్లవి. ప్రస్తుతం విరాటపర్వం, లవ్‌ స్టోరీ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ తారకు సమయం దొరికితే ఇష్టమైన ప్రదేశాలను చుట్టిరావడమంటే చాలా ఇష్టం. లాక్ డౌన్ సమ‌యంలో సాయిపల్లవి తన తల్లితో కలిసి కారులో తిరుగుతూ తొలకరి వర్షంలో తడుస్తున్న ఫొటోలను ఇన్‌ స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా..వైరల్‌ అయ్యాయి. ఇపుడు తాజాగా మరో త్రోబ్యాక్‌ వెకేషన్‌ స్టిల్‌ను అందరితో పంచుకుంది సాయిపల్లవి. ఈ బ్యూటీ తనకు టైం దొరికినపుడు జైపూర్‌ వెకేషన్‌కు వెళ్లింది. జైపూర్‌ అంటే రాజ్‌పుత్‌ రాజ వంశీయుల కాలం నాటి కోటలు చాలా ఉంటాయనే విషయం తెలిసిందే.

ఆ కోటల్లో కలియతిరుగుతూ ఎంజాయ్‌ చేసింది సాయిపల్లవి. అంతేకాదు రాజ్‌పుత్‌ వంశానికి చెందిన రాణులు వేసుకున్న దుస్తులను ప్రతిబింబించే కాస్ట్యూమ్స్‌ ధరించింది. రాజ్‌పుత్‌ రాణి గెటప్‌లో కోటపై నుంచి తొంగి చూస్తున్న స్టిల్‌ సాయిపల్లవి అభిమానులకు కనువిందు చేస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo