సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. ఈ సినిమా ట్రైలర్ తాజాగా చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అవినీతి రహిత సమాజ కోసం రాజకీయ నాయకులతో యంగ్ కలెక్టర్ చేసే పోరాటమే రిపబ్లిక్ సినిమా. దేవా కట్టా చాలా రోజుల తర్వాత ఒక సీరియస్ సినిమాతో వస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 1న సినిమా విడుదల కానుంది. ఇదంతా బాగానే ఉంది. ఇంతకు ముందు కూడా రిపబ్లిక్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఈ సినిమాకు మరింత ఎమోషన్స్ తోడయ్యాయి. దానికి కారణం సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉండటమే.
సెప్టెంబర్ 10న సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజూ అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. రోజురోజుకు ఈయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుందని వైద్యులు చెబుతున్నారు. సొంతంగా శ్వాస తీసుకోవడంతో వెంటిలేటర్ కూడా తీసేసినట్టు తెలిపారు వైద్యులు. ఇలాంటి సమయంలో ఈయన నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధమవుతుదండటంతో ఒక రకమైన ఎమోషన్స్ అందరిలోనూ కనిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు ట్రైలర్ లాంచ్ చేస్తున్న సమయంలో కూడా చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రిలో ఉన్న ఈ సమయంలో ట్రైలర్ విడుదల చేస్తుండటంతో తన మనసంతా భారంగా అయిపోయిందని ఎమోషనల్ అయ్యాడు. వాడు కోలుకుంటున్నాడు.. అందరి ప్రార్థనలతో త్వరలోనే మనం ముందుకు వస్తాడని తెలిపాడు.
రిపబ్లిక్ సినిమా విడుదలకు మరొక రెండు వారాలు ఉన్న ఈ సమయంలో.. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రమోషన్స్‌కు వస్తాడని తెలుస్తోంది. ఇది సినిమాకు మరింత హెల్ప్ కావడం ఖాయం. అయితే సాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్స్‌కు రావడం ఎంతవరకూ కరెక్ట్ అనేది అర్థం కావడం లేదు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆయన బయటికి వస్తాడని తెలుస్తోంది. తేజ్ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కనీసం నెల రోజులు పట్టేలా కనిపిస్తోంది. రిపబ్లిక్ తర్వాత మరో రెండు సినిమాలకు కమిటయ్యాడు మెగా మేనల్లుడు. వాటి షూటింగ్ డిసెంబర్లో మొదలయ్యేలా కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood | వాణి విశ్వనాథ్ కూతురితో కోటి కొడుకు సినిమా
Lahari: దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న శ్రీరామ్- లహరి
Ntr: కారు నెంబర్ కోసం తారక్ అంత ఖర్చు పెట్టాడా..!
Sidharth Malhotra: కియారాతో సిద్ధార్థ్ ప్రేమాయణం.. పెళ్లిపై నోరు విప్పిన యువ హీరో
Samantha: సమంతకు భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?