శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 00:16:09

షట్‌చక్రం కథేమిటో..?

షట్‌చక్రం కథేమిటో..?

సాయితేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ప్రకటన శుక్రవారం వెలువడింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందిస్తుండగా...ఆయన వద్ద రచనా శాఖలో పనిచేసిన కార్తీక్‌ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే అంతిమ పుష్కరే’ అనే సంస్కృత వాక్యంతో పాటు షట్‌ చక్రంలో ఓ కన్ను దర్శనమిస్తోంది. ‘మిస్టిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. షట్‌చక్రం, సంస్కృత వాక్యం వెనకున్న కథేమిటన్నది ఆద్యంతం ఆసక్తిని పంచుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.


logo