మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 09:09:35

ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా అద‌ర‌గొట్ట‌నున్న మెగా హీరో

ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా అద‌ర‌గొట్ట‌నున్న మెగా హీరో

కొన్ని ఫ్లాపుల త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ మంచి హిట్స్‌తో దూసుకెళుతున్నాడు. చిత్రల‌హ‌రి, ప్ర‌తిరోజు పండగే చిత్రాలతో స‌క్సెస్ ట్రాక్‌లోకి ఎక్కిన తేజూ ప్ర‌స్తుతం  'ప్రస్థానంస ఫేం దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర‌కి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.  యువ ఐఏఎస్ ఆఫీసర్‌గా తేజూ క‌నిపించ‌నున‌న్నాడ‌ని, ఆయ‌న పాత్ర సినిమాని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ స్టోరీ నేపథ్యం ఉత్తర భారతదేశంలో సాగుతుందని తెలుస్తోంది. ప్ర‌స్తుతం తేజూ త‌న పాత్ర కోసం పలువురు ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు బ్యూరోక్రాట్స్ వీడియోలు చూస్తూ ఎలా న‌టించాల‌నే దానిపై అవ‌గాహ‌న తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌. కాగా,  సుబ్బు దర్శకత్వంలో తేజూ చేస్తున్న‌ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. . నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo