శుక్రవారం 29 మే 2020
Cinema - Apr 07, 2020 , 22:54:54

భయానికి దూరంగా ఉందాం

భయానికి దూరంగా ఉందాం

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అసత్యపు వార్తలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఆందోళన, భయాల్ని కలిగించే వ్యక్తులకు, వార్తలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మహేష్‌బాబు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా ప్రభుత్వాలతో పాటు వైద్యులు, పోలీసు సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ‘కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో  ప్రభుత్వాలు ఐకమత్యంతో కృషిచేస్తున్నాయి.  కోవిడ్‌-19తో జరుగుతున్న యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వారికి కృతజ్ఞతలు చెబుతాం.ఈ విపత్కర పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పనిచేస్తున్న యోధులను గౌరవిద్దాం. సామాజిక దూరం, శుభ్రతతో భయానికి దూరంగా ఉండటం కూడా ఈ పరిస్థితుల్లో చాలా  అవసరం. అసత్యపు వార్తలు పెద్ద సమస్యగా పరిణమించాయి.  పక్కదారి పట్టించే అలాంటి వార్తలకు దూరంగా ఉందాం’ అని మహేష్‌బాబు ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. logo