ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 10:32:07

ఆ సినిమా ట్రైల‌ర్‌కి లైక్స్ క‌న్నా డిస్ లైక్స్ ఎక్కువ‌..!

ఆ సినిమా ట్రైల‌ర్‌కి లైక్స్ క‌న్నా డిస్ లైక్స్ ఎక్కువ‌..!

సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంధుప్రీతి కార‌ణంతోనే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని కొంద‌రు ఆరోప‌ణ‌లు చేయ‌డంతో స‌ల్మాన్, అలియా, మ‌హేష్ భ‌ట్‌, క‌ర‌ణ్ జోహార్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ వంటి పెద్ద‌ల‌ని నెటిజ‌న్స్ ఏకి పారేస్తున్నారు. అంతేకాదు వారికి సంబంధించిన సినిమాల విష‌యంలోను మొండి వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన స‌డ‌క్ 2 ట్రైల‌ర్‌ని లక్షన్నర మంది లైక్ చేస్తే, 25 ల‌క్ష‌ల మంది డిస్ లైక్స్ చేశారు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు. అభిమానుల‌లో బంధుప్రీతి అనేది ఎంత బ‌లంగా నాటుకుపోయిందో..!

సంజయ్‌ దత్‌, పూజా భట్‌ జంటగా 1991లో మహేశ్‌భట్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సడక్‌’. దానికి సీక్వెల్‌గా సంజయ్‌ దత్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, పూజా భట్‌, ఆలియా భట్‌ ప్రధాన తారలుగా ‘సడక్‌ 2’ తెరకెక్కింది. 20 ఏళ్ల తర్వాత మహేశ్‌భట్  తెర‌కెక్కించిన ఈ సినిమా ఆగ‌స్ట్‌ 28న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో సినిమా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. బుధ‌వారం ఉద‌యం ట్రైల‌ర్ విడుద‌ల కాగా, సాయంత్రానికి 25లక్షలమందికి (2.5 మిలియన్‌) పైగా దీనిని డిస్‌ లైక్‌ చేశారు. సినిమా చూడొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.  ట్రైల‌ర్ కింద ఈ సినిమాను విమ‌ర్శిస్తూ "జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


logo