బుధవారం 03 జూన్ 2020
Cinema - May 16, 2020 , 12:21:21

అక్ష‌య్ ఫ్యామిలీలో విషాదం.. గుండెపోటుతో బంధువు మృతి

అక్ష‌య్ ఫ్యామిలీలో విషాదం.. గుండెపోటుతో బంధువు మృతి

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ బంధువు స‌చిన్ కుమార్ గుండెపోటుతో మే 15న క‌న్నుమూశారు. మే 13న బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకున్న ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో అక్ష‌య్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు దిగ్భ్రాంతి చెందారు. వెంట‌నే ఆయ‌న ఇంటికి వెళ్ళారు. స‌చిన్‌ని చూసి అక్ష‌య్ భావోద్వేగానికి గురైన‌ట్టు తెలుస్తుంది. 

స‌చిన్ మ‌ర‌ణం హృద‌య విదార‌కం. ఆయ‌న లోటు తీర్చ‌లేనిది. స‌చిన్ కుటుంబ స‌భ్యుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని స‌చిన్ స్నేహితుడు రాకేష్ పాల్ అన్నారు. ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ఆయ‌న మృతికి సంతాపం తెలిపారు. ఏక్తా క‌పూర్ న‌టించిన 'క‌హానీ ఘ‌ర్ ఘ‌ర్ కీ'  సినిమాలో సచిన్ కుమార్ హారోగా న‌టించారు. అనంత‌రం ఫోటో గ్రాఫ‌ర్‌గా మారి న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పారు. 


logo