ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 11:10:03

గుట్కా అక్ర‌మ ర‌వాణా.. స‌చిన్ అరెస్ట్‌

గుట్కా అక్ర‌మ ర‌వాణా.. స‌చిన్ అరెస్ట్‌

మౌన‌మేల‌నోయి చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన స‌చిన్ జోషి ఆ త‌ర్వాత నిను చూడక నేనుండలేను, ఒరేయ్‌ పండు, ఆజాన్‌, జాక్‌పాట్‌, వీరప్పన్‌, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్  చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు. ఆ మ‌ధ్య ప‌లు వివాదాలతో వార్త‌ల‌లోకి ఎక్కిన స‌చిన్ జోషి..తాజాగా గుట్కా అక్ర‌మ రవాణా కేసులో అరెస్ట్ అయ్యాడు. హైద‌రాబాద్ పోలీసులు అత‌నిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

కొద్ది రోజుల క్రితం గుట్కా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న కొందరిని అరెస్ట్ చేసి ముంబై పోలీసులు విచార‌ణ జ‌ర‌ప‌గా, ఈ విచార‌ణ‌లో స‌చిన్ జోషి పేరు వెలుగులోకి వ‌చ్చింది. నిందితులు చెప్పిన అన్ని అంశాల‌ను నిర్ధారించుకున్న హైద‌రాబాద్ పోలీసులు ముంబై వెళ్లి అజ్ఞాతంలో ఉన్న ఆయ‌న‌ని అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్ట్‌లో స‌చిన్ జోషి పోలీసుల‌కి చిక్కిన‌ట్టు తెలుస్తుంది.   అతడిపై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. గతంలోనే ఆయనకు నోటీసులు జారీచేసినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, దీంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.  కాగా,  ఇటీవల బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో   సచిన్‌ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తలు

డ్ర‌గ్స్ కేసు: వివేక్ ఒబేరాయ్ ఇంట్లో సోదాలు

కేర‌ళ గోల్డ్ స్కామ్‌లో దావూద్ ఇబ్ర‌హీం హస్తం


logo