ఒకప్పుడు విలన్ పాత్రలతో ప్రేక్షకులని మెప్పించిన సోనూసూద్ కరోనా మహమ్మారీ నేపథ్యంలో ఆపత్కాల బాంధవుడిగా ప్రజల్లో ఓ వెలుగు వెలిగారు. రియల్ హీరోగా ఆయనని అభిమానులు ఆరాధిస్తున్నారు. రాను రాను సోనూసూద్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. అతనిని కలిసేందుకు అభిమానులు కిలో మీటర్ల మేర పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు సోనూని నెగెటివ్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఏ మాత్రం ఇష్టపడడం లేదు.
సోనూసూద్ ప్రస్తుతం ఓ మ్యూజిక్ ఆల్భమ్ చేస్తున్న విషయం తెలిసిందే . నిధి అగర్వాల్ తో నటించిన కొత్త హిందీ మ్యూజిక్ వీడియో సాథ్ క్యా నిభావోగే
నేడు విడుదలైంది. దీనికి ఫరా ఖాన్ కొరియోగ్రఫీ కం డైరెక్షన్ చేయడం ఆసక్తికరం. ఈ పాటను పంజాబ్ పరిసరాల్లో చిత్రీకరించారు. ఇందదులో నిధితో రొమాన్స్ ని ఓ రేంజులోనే పండించాడు సోనూ. రియల్ హీరోలో ఇంత విషయం ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు.
సాథ్ క్యా నిభావోగే అనేది అల్తాఫ్ రాజా తొంబైల నాటి పాట.. టమ్ టు థెహ్రే పరదేశి
కి రీమిక్స్ వెర్షన్. విడిపోయిన ప్రేమికుల విరహగీతం ఇదని చెప్పొచ్చు. బార్ డ్యాన్సర్ నిధిని కాపాడటానికి సోను ఆరంగేట్రం చేసే తీరును తెరపై ఆవిష్కరించారు. థీమ్ ఆద్యంతం ఆసక్తికరం. అల్తాఫ్ రాజా – టోనీ కక్కర్ ఈ పాటకు గాత్రం అందించారు. ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.