శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 15:29:16

సాహో టీఆర్పీతో బిత్త‌ర‌పోయిన ప్ర‌భాస్ ఫ్యాన్స్‌

సాహో టీఆర్పీతో బిత్త‌ర‌పోయిన ప్ర‌భాస్ ఫ్యాన్స్‌

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్థాయికి ఎదిగిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత సాహో అనే భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టించాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ని పూర్తిగా నిరాశ‌ప‌రిచింది. హిందీలో వెండితెర‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కులని  అల‌రించిన సాహో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అందించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంది. 

సాహో చిత్రాన్ని రీసెంట్‌గా టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌గా బుల్లితెర‌పై ప్ర‌ద‌ర్శించారు.  ఈ చిత్రం 5.8 టీ ఆర్పీ సాధించగా, ఛానెల్ యాజ‌మాన్యంతో పాటు అభిమానులు బిత్త‌ర‌పోయారు. అదే రోజు వేరే ఛానెల్‌లో కార్తికేయ న‌టించిన గుణ 369 చిత్రం ప్ర‌ద‌ర్శించ‌బ‌డ‌గా, ఈ చిత్రానికి 5.9 రేటింగ్ ద‌క్కింది. అంటే సాహో క‌న్నా గుణ 369 చిత్రం ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించింది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సాహో  హిందీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ, తెలుగులో ఎందుకు ఇంత దారుణంగా విఫ‌ల‌మ‌వుతుంది అని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు.