ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 16, 2020 , 17:31:48

సాహోకి నీరాజనం ప‌లుకుతున్న హిందీ ప్రేక్ష‌కులు

సాహోకి నీరాజనం ప‌లుకుతున్న హిందీ ప్రేక్ష‌కులు

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో త‌మిళం, హిందీ న‌టులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు. ప‌లు భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రం బాలీవుడ్‌లో విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది.  తెలుగులో అంత‌గా అల‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, హిందీలో మాత్రం రూ.400 కోట్లు కొల్ల‌గొట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే సాహో చిత్రం బిగ్ స్క్రీన్ పైనే కాదు బుల్లితెరపై దుమ్ము రేపుతుంది. 

సాహో చిత్రం ఇప్ప‌టికే హిందీలో మూడు సార్లు స్మాల్ స్క్రీన్‌పై ప్ర‌ద‌ర్శిత‌మైంది.  మొట్ట మొదటిసారి ఈ చిత్రాన్ని అక్కడ టెలికాస్ట్ చెయ్యగా భారీ ఎత్తున 1 కోటి 28 లక్షల వ్యూవర్ షిప్స్ రాగా రెండో టెలికాస్ట్ లో 52 రెండు లక్షలకు పైగా ఇంప్రెషన్స్ రాబట్టి సత్తా చాటింది. ఇక రీసెంట్‌గా మూడోసారి టెలికాస్ట్ చేసినపుడు మాత్రం రెండో సారి కంటే భారీ ఎత్తున 83 లక్షల వ్యూవర్ షిప్స్ ను రాబట్టినట్టు తెలుస్తుంది.  అంటే బాలీవుడ్‌లో సాహో ప్ర‌భంజ‌నం ఏ విధంగా సాగుతుందో అర్దం చేసుకోవ‌చ్చు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo