ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 13:11:36

రెండేళ్ళు పూర్తి చేసుకున్న ఆర్ఎక్స్ 100..

రెండేళ్ళు పూర్తి చేసుకున్న ఆర్ఎక్స్ 100..

రెండేళ్ల క్రితం ఇదే రోజు అంటే జూలై 12,2018న విడుద‌లైన యాక్ష‌న్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ చిత్రం ఆర్ఎక్స్ 100 తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదాన్ని అందించింది. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్, రావు రమేష్, సింధూర పువ్వ రామ్ తదితరులు నటించారు.  నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు. 

ప్రేమ కోసం ప‌రిత‌పించి పిచ్చోడిలా మారిన వ్య‌క్తి క‌థ‌ని వినోదంగా రూపొందించాడు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ని షేక్ చేసింది. కార్తికేయ‌, పాయ‌ల్‌కి ఇది తొలి సినిమానే అయిన‌ప్ప‌టికీ మంచి ప‌రిణితితో న‌టించారు. కామంతో ర‌గిలిపోతున్న గొప్పింటి అమ్మాయిగా పాయ‌ల్ అల‌రించింది. రెండేళ్లు పూర్తైన సంద‌ర్బంగా కార్తికేయ త‌న ట్విట్ట‌ర్‌లో ఎమోష‌నల్ పోస్ట్ పెట్టారు.

జూలై 12.. ఈ తేదీని  నా జీవితంలో ఏ సమయంలోనైనా చూసినప్పుడు నాకు అద్భుతాలపై నమ్మకం, కలలపై విశ్వాసం, జీవితంలో ఆశ క‌లుగుతుంది. 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున నాకు పునర్జన్మ క‌లిగింది. నా పున‌ర్జ‌న్మ‌కి తండ్రి అజ‌య్ భూప‌తి. అత‌నికి నా జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను అని పేర్కొన్నారు కార్తికేయ .


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo