శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 15:36:57

స్పెష‌ల్ సాంగ్ లో ' ఆర్ఎక్స్ 100' భామ‌

స్పెష‌ల్ సాంగ్ లో ' ఆర్ఎక్స్ 100'  భామ‌

శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హాస‌ముద్రం. ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి డైరెక్ట‌ర్‌. ఇంటెన్స్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వ‌స్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌, అదితీరావు హైద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది పంజాబీ ముద్దుగుమ్మ పాయ‌ల్‌రాజ్‌పుత్‌. మ‌హాసముద్రంలో స్పెష‌ల్ సాంగ్ చేయాల‌ని పాయ‌ల్‌రాజ్‌పుత్ ను డైరెక్ట‌ర్ అజ‌య్‌భూప‌తి సంప్ర‌దించాడ‌ట‌.

త‌న‌కు మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్ట‌ర్ కావ‌డంతో స్పెష‌ల్ సాంగ్ ఆఫ‌ర్ కు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్‌. పాయ‌ల్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంది. క‌మ‌ల్‌హాస‌న్-శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఇండియ‌న్ 2 లో కూడా పాయ‌ల్ ప్ర‌త్యేక గీతంలో క‌నిపిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చినా..ఆ ప్రాజెక్టు అట‌కెక్క‌డంతో పుకార్ల‌కు తెర‌ప‌డ్డ‌ది. 

ఇవి కూడా చ‌ద‌వండి..

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

దుబాయ్‌లో ఘ‌నంగా న‌మ్ర‌త బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ .. పిక్స్ వైర‌ల్

క‌థ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షోకు రెడీ అంటున్న ప్రియ‌మ‌ణి

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

'నార‌ప్ప' డైరెక్ట‌ర్ కొత్త సినిమా ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo