మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 23, 2021 , 07:22:49

మ‌రోసారి వార్త‌ల‌లోకి మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీ..!

మ‌రోసారి వార్త‌ల‌లోకి మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీ..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోస్ చిరంజీవి, నాగార్జున ఇప్ప‌టికే త‌మ వార‌సులని  ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ కూడా త‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌ను హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు. కొన్నేళ్ళుగా మోక్ష‌జ్ఞ ఎంట్రీపై వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ దీనిపై క్లారిటీ మాత్రం రావ‌డం లేదు. తాజాగా మ‌రోసారి బాల‌య్య త‌న‌యుడి వెండితెర ఎంట్రీకి సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

జూన్ 10న బాల‌య్య బ‌ర్త్ డే కావ‌డంతో ఆ రోజు మోక్ష‌జ్ఞ చిత్రం ప్రారంభం అవుతుంద‌ని ఇన్‌సైడ్ టాక్. ఇక ఈ సినిమాని డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కుడు ఎవ‌రో కూడా క‌న్‌ఫాం చేశారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు , చిరు త‌న‌యుడిని ప‌రిచ‌యం చేసిన పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు బాలయ్య త‌న‌యుడి తొలి సినిమాను డైరెక్ట్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌లో ఎంత నిజం ఉంద‌నేది మ‌రి కొద్ది రోజుల‌లో తేల‌నుంది. 

VIDEOS

logo