ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 14:43:41

సింగ‌ర్ సునీత రెండో పెళ్ళి చేసుకోబోతుందంటూ క‌థ‌నాలు!

సింగ‌ర్ సునీత రెండో పెళ్ళి చేసుకోబోతుందంటూ క‌థ‌నాలు!

సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్నారు సునీత‌.ఈమె పాట‌కు ప‌ర‌వ‌శించని వారు ఉండ‌రు. కొన్ని ద‌శాబ్ధాలుగా త‌న గానంతో ప్రేక్ష‌కులని అల‌రిస్తున్న సునీత త‌న రెండో పెళ్లి విష‌యంలో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌చ్చారు. ఆ మ‌ధ్య సునీత రెండో పెళ్లి చేసుకోనుందంటూ ప‌లు వార్త‌లు రాగా, దానిని ఓ ఇంట‌ర్వ్యూలో ఖండించింది. సింగిల్‌గానే ఉంటానంటూ చెప్పుకొచ్చింది.

40 ఏళ్ళ సునీత‌కు 18 ఏళ్ల వ‌య‌స్సులోనే వివాహం కాగా, వారికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. భ‌ర్త‌తో విభేదాల కార‌ణంగా అత‌నికి గుడ్ బై చెప్పిన సునీత పిల్ల‌ల‌ని త‌నే పెంచుకుంటూ కాలం గ‌డుపుతుంది. అయితే తాజాగా సునీత రెండో పెళ్లి చేసుకోనుందంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ‌డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మ్యాన్ ని సునీత‌ వివాహం చేసుకోనుంద‌ని,  ఆ వ్య‌క్తికి కూడా ఇది రెండో వివాహ‌మేన‌ని అంటున్నారు. జోరుగా జ‌రుగుతున్న ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.